Saturday, May 23, 2026

“సమవర్తి” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్

- Advertisement -

“సమవర్తి” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి “సమవర్తి” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. “సమవర్తి” సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి  జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“సమవర్తి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ చుట్టూ గొడ్డళ్లు, కత్తులతో కొందరు దూసుకురాగా, ఆయన ఎలాంటి భయం లేకుండా హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ ఇంటెన్స్ లుక్స్ లో కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. సమవర్తి అంటే యముడు, ఎవరి పట్ల పక్షపాతం లేనివాడు అని అర్థం. ఈ సమవర్తి శత్రువుల పాలిట యముడిలా మారి వారందరినీ ఎలాంటి తేడాలు లేకుండా ఒకేలా కనుమరుగు చేస్తాడని అనుకోవచ్చు. సత్యదేవ్ కెరీర్ లో ఇదొక హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ అవుతుందనే అంచనాలు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి.
నటీనటులు – సత్యదేవ్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్