నివేదా థామస్ తమ్ముడు హీరోగా ” బెంగుళూరు మహానగరం లో బాలక” మూవీ
The movie “Bangalore Mahanagaramlo Balaka” features Nivetha Thomas’s younger brother as the lead actor.
మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, మహి – రాజ్ ద్వీయ దర్శకత్వంలో బెంగళూరు మహానగరంలో బాలక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి
చేసుకున్న ఈ చిత్రం మొదటి లుక్, కధానాయకుడు ప్రియదర్షి విడుదల చేశారు.తెలుగు కుర్రాడు బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ
సినిమా వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ నటిస్తున్న
ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విశ్వదీప్ సంగీతాన్ని అందిస్తున్నారు, హర్షిత్ కొటా ఏడిటర్ గా చేస్తున్నారు.
ఈ చిత్రంలో Raghu Karumanchi ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, ఆయనతో పాటు Chitram Srinu కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే నటులు మరియు సోషల్
మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ధనరాజ్ వినీత్, మహేంద్ర, అచ్యుత్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.



