హిట్ అండ్ రన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

- Advertisement -

హిట్ అండ్ రన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

‘Hit and Run’ Movie First Look Released

క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లకు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆడియెన్స్ డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లకు మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో త్వరలో రానున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌ల  మీద సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ఫినిష్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా ‘హిట్ అండ్ రన్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సంజయ్ రావ్ ఇంటెన్స్ లుక్, ఆ గాయాలు, రక్తంతో నిండిపోవడం చూస్తుంటే ‘హిట్ అండ్ రన్’ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది.
త్వరలోనే ‘హిట్ అండ్ రన్’ టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. టీజర్ వచ్చిన తరువాత మూవీ మీద ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరుగుతాయని మేకర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
*తారాగణం* : సంజయ్ రావ్, నటాషా సింగ్, కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular