ముషీరాబాద్ లో పెద్ద ఎత్తున చేపల అమ్మకాలు
హైదరాబాద్
Large-scale fish sales in Musheerabad
మృగశిర కార్తె సందర్భంగా నగరంలోని అతిపెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్లో పెద్ద ఎత్తున చేపల అమ్మకాలు కొనసాగాయి. స్థానికులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున మార్కెట్కు తరలివచ్చి చేపలు కొనుగోలు చేశారు .దీంతో మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము రెండు గంటల నుంచి వ్యాపారాన్ని ప్రారంభించారు. మృగశిర కార్తె సోమవారం రావడం వల్ల అమ్మకాలు కొంత తగ్గాయని స్థానిక గంగపుత్ర సంఘం నాయకుడు జీ. ప్రసాద్ తెలిపారు. కొనుగోలుదారులు మోసపోకుండా తూనికల కొలతల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారుపోలీసులు




