మహిళా నాయకులపై బీజేపీ రాజకీయ కక్ష సాధింపు: మిద్దెల జితేందర్

- Advertisement -

మహిళా నాయకులపై బీజేపీ రాజకీయ కక్ష సాధింపు: మిద్దెల జితేందర్

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి దెబ్బ

BJP engaging in political vendetta against women leaders: Middela Jitender

హైదరాబాద్, జూన్ 10: వాయిస్ టుడే  

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దేశ ప్రజాస్వామ్యానికి తీవ్ర దెబ్బ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గాంధేయ సిద్ధాంతాలను విశ్వసిస్తూ బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న మీనాక్షి నటరాజన్‌ను రాజకీయంగా అణచివేయాలనే ఉద్దేశంతో బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

2009 నుంచి 2014 వరకు మధ్యప్రదేశ్‌లో పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకురాలిని లక్ష్యంగా చేసుకోవడం బీజేపీ అసహన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పే బీజేపీ, మహిళా నాయకులు ఎదిగితే వారిని బెదిరించడం, కేసులు నమోదు చేయించడం, ప్రజాస్వామ్య హక్కులను హరించడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపర్చడం, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చివేయడానికి ప్రయత్నించడం బీజేపీ అధికార దాహాన్ని స్పష్టంగా చూపుతోందని జితేందర్ ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి రెండు స్థానాలు గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ, అధికార అహంకారంతో ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ, సేవాదళ్ దేశవ్యాప్తంగా ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తాయని మిద్దెల జితేందర్ స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular