ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాక్రోచ్‌లు రోడ్లపైకి వస్తాయి”  చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాక్రోచ్‌లు రోడ్లపైకి వస్తాయి”
 చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక
విజయవాడ, జూన్ 11

“Cockroaches will come out onto the roads in Andhra Pradesh too” — YS Jagan’s warning to Chandrababu.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం  జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, లీకులు, స్కాములపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాక్రోజ్‌లు, జెన్జీలు రోడ్లపైకి వస్తారని జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబుకు హెచ్చరించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో వెలుగులోకి వస్తున్న అక్రమాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 16 వేల పోస్టుల భర్తీలోనే ఇంత ఘోరంగా స్కాములు, లీకులు జరగడం దేశ చరిత్రలోనే ఎక్కడా చూడలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం లక్షల మంది నిరుద్యోగ యువత ఆశలను, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిందని మండిపడ్డారు. డీఎస్సీ అంటే నిరుద్యోగుల భవిష్యత్తు అని, అలాంటి పవిత్రమైన నియామక ప్రక్రియను కూడా అవినీతిమయం చేయడం దారుణమని ధ్వజమెత్తారు.చంద్రబాబు రాజకీయ జీవితమంతా అబద్ధాలు, మోసాలు, దగాతోనే సాగిందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. అబద్ధానికి, వెన్నుపోటుకు, స్కాముకు ఒక షర్టు, ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు  అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్ అంటూ ఇచ్చిన హామీల నుంచి.. తాజాగా టీచర్ల రిక్రూట్‌మెంట్‌ వరకు బాబు ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తోందన్నారు. కేవలం 16 వేల పోస్టులకే లీకులు, స్కామ్‌లు జరుగుతుంటే.. దీనికి మళ్లీ  మెగా డీఎస్సీ  అని పేరు పెట్టడానికి చంద్రబాబుకు ఏమాత్రం అర్హత లేదని నిలదీశారు. ఇలాంటివి చూసిన యువత రోడ్డుపైకి వస్తారని, జెన్జీలు, జెన్ఆల్ఫాలు, కాక్రోజ్‌లు ఏదో రూపంలో చంద్రబాబును అధికారం నుంచి దించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని జగన్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాము సాధించిన రికార్డులను ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. 2019 మే 30న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేవలం 50 రోజుల్లోనే  జీవో ఇచ్చి, రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టామని వివరించారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే భర్తీ చేసి చూపించామని స్పష్టం చేశారు. ఆనాడు 2,800 సెంటర్లలో దాదాపు 19 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసినా.. ఎక్కడా ఒక్క చిన్న తప్పు లేదా లీకేజీ కూడా జరగలేదని, అదీ తమ ప్రభుత్వ చిత్తశుద్ధి అని గర్వంగా చెప్పారు.చంద్రబాబు అధికారంలోకి రాగానే ‘ఐదు తొలి సంతకాలు’ అంటూ నానా హంగామా, ఆర్భాటం చేశారని, కానీ అవన్నీ పెద్ద మోసాలని జగన్ విమర్శించారు. అందులో మెగా డీఎస్సీ సంతకం కూడా ఒకటన్నారు. నిజానికి తమ ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇస్తే.. దానిని చంద్రబాబు ప్రభుత్వం కావాలనే రద్దు చేసి, రిక్రూట్‌మెంట్‌ను ఆలస్యం చేసిందని ఆరోపించారు. పాత పోస్టులను కలిపి ఇప్పుడు ఇస్తున్న 16 వేల పోస్టులకే ‘మెగా’ అనే కలరింగ్ ఇస్తూ.. లోపల మాత్రం అక్రమాలకు తెరలేపారని దుయ్యబట్టారు. ఎవరికి వారుగా సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోదని, పారదర్శకమైన సుపరిపాలన అంటే ఏంటో తమ ఐదేళ్ల పాలనలో ప్రజలు చూశారన్నారు.   విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన ఉదంతాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బాధితులను పరామర్శించే విషయంలో కూటమి నేతలు అత్యంత దారుణంగా ప్రవర్తించారని విమర్శించారు. సమస్యలు చెప్పడానికి వచ్చిన కార్మికులను చూసి “మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా.. మీకెందుకు?” అని మంత్రి లోకేష్ అగౌరవంగా మాట్లాడటం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు అవగాహన లేదంటూ వెళ్ళిపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, అలాగే డీఎస్సీ అభ్యర్థుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
=================

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular