జీర్ణాశయ శస్త్రచికిత్సల్లో ఆధునిక సాంకేతికతలు
రోగులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన చికిత్స
సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
డా. ప్రసాద్ బాబు
Modern technologies in gastric surgeries offer safer and faster treatment for patients: Dr. Prasad Babu.
వాయిస్ టుడే- కరీంనగర్
జీర్ణాశయ (గ్యాస్ట్రో ఇంటెస్టినల్) వ్యాధుల చికిత్సలో ఆధునిక సాంకేతికతలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని యశోద సికింద్రాబాద్
సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. ప్రసాద్ బాబు టి.ఎల్.వి.డి. అన్నారు. లాపరోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా రోగులకు మరింత సురక్షితమైన, ఖచ్చితమైన, వేగవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. బుధవారం నగరంలోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో పెద్ద కోతలతో నిర్వహించే సంప్రదాయ శస్త్రచికిత్సలకు బదులుగా ప్రస్తుతం మినిమల్లి ఇన్వేసివ్ (చిన్న రంధ్రాల) విధానాలు అందుబాటులోకి రావడంతో రోగులు వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. అన్నవాహిక, కడుపు, కాలేయం, క్లోమగ్రంధి, పిత్తాశయం, పెద్దపేగు, పురీషనాళ క్యాన్సర్లు, సంక్లిష్ట హెర్నియాలు, స్థూలకాయం, రిఫ్లక్స్ వ్యాధుల చికిత్సలో ఈ సాంకేతికతలు విశేష ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. లాపరోస్కోపిక్ విధానంలో హైడెఫినిషన్ కెమెరాల సహాయంతో ఆపరేషన్ నిర్వహిస్తారని, దీనివల్ల నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గడంతో పాటు ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉంటే సరిపోతుందన్నారు. రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా త్రిమితీయ (3డీ) దృశ్యాలు, అత్యంత సూక్ష్మ కదలికల నియంత్రణ వీలవుతుందని, సంక్లిష్ట ప్రాంతాల్లోని ఆపరేషన్లకు ఇది ఎంతో ఉపయోగకరమని వివరించారు. జీర్ణాశయ సమస్యలను ముందుగానే గుర్తించి నిపుణులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ జయదీప్ మాట్లాడుతూ
సమాజంలో ఆందోళన వ్యక్తం చేశారు. కొందరికి జీవనశైలి మార్పుల వల్ల ఉబకాయం తగ్గించుకోవచ్చు అన్నారు. మరికొందరికి సర్జరీ తప్పనిసరి అని ఆ సర్జరీ ఇప్పుడు ఆంకేతికంగా రోబోటిక్ సర్జరీ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు. ఊబకాయం వల్ల ఇతర అవయవాలపై ప్రభావం పడుతుందని దువ్వకాయలు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ హెడ్ నరేంద్ర మోరా, శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు




