‘మండాడి’ మూవీ నుంచి మేకింగ్ వీడియో
Making-of video from the movie ‘Mandadi’
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. రియల్ లొకేషన్స్‌లో నేచురలిస్టిక్‌గా తెరకెక్కించిన ఈ మూవీని సెప్టెంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
రు. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయని సమాచారం. సుహాస్, సూరి మధ్య సన్నివేశాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని టీం చెబుతోంది. ఇక తాజాగా సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని షేర్ చేశారు. అందులో సుహాస్ మేకోవర్, సీన్స్‌ను షూట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇక కత్తి పట్టుకుని రా అండ్ రస్టిక్ లుక్‌లో సుహాస్ అలా నడుచుకుంటూ వస్తుంటే థియేటర్లో విజిల్స్ పక్కా అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో సాట్ట పులిగా సుహాస్ అద్భుతమైన పాత్రలో, నెవ్వర్ బిఫోర్ అనేలా మెప్పించబోతోన్నారనిపిస్తోంది.
ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. చిత్ర బృందం ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.
మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్‌లతో ‘మండాడి’పై అంచనాలు పెంచనున్నారు. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
*నటీనటులు* : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు




