అగ్ర రాజ్యంలో తొలిసారిగా రుద్ర యాగం

- Advertisement -

అగ్ర రాజ్యంలో తొలిసారిగా రుద్ర యాగం

Rudra Yagam held for the first time in the leading nation.
లోకాః సమస్తాః సుఖినో భవంతు” అనే విశ్వమంగళ సంకల్పంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తొలిసారిగా నిర్వహించబడుతున్న “నవకుండాత్మక శత చండీ సహిత శత రుద్ర యాగం” ఆధ్యాత్మిక చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలవబోతోంది. మిస్సోరీ రాష్ట్రంలోని బాల్విన్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ఈ మహాయజ్ఞానికి వేదికగా సిద్ధమవుతోంది.అర్ధనారీశ్వర తత్త్వానికి సజీవ రూపం.ఈ మహాయాగం  ప్రధాన విశిష్టత శివ-శక్తి సమన్వయం. ఉదయం జరిగే మహాన్యాస పూర్వక శత రుద్ర హోమం పరమశివుని చైతన్య స్వరూపాన్ని ప్రతిబింబిస్తే, సాయంత్రం జరిగే శత చండీ పారాయణం , చండీ హోమం ఆదిపరాశక్తి మహిమను ప్రతిఫలిస్తుంది.ఈ రెండు యాగాలు కలిసి అర్ధనారీశ్వర తత్త్వాన్ని ప్రతినిధ్యం చేస్తూ, చైతన్యం, శక్తి కలయిక ద్వారా వ్యక్తి, సమాజం , విశ్వానికి సమగ్ర శాంతి, శ్రేయస్సు ప్రసాదించే దివ్య యజ్ఞంగా నిలుస్తాయి.ప్రతి సాయంత్రం దేవీ మహాత్మ్యం (దుర్గా సప్తశతి) పారాయణం, చండీ హోమం జరుగుతుంది. మొత్తం ఐదు రోజులలో 100 సార్లు చండీ పారాయణం* జరగడం అత్యంత అరుదైన ఆధ్యాత్మిక విశేషం. ఇది ప్రాంతీయ స్థాయిలో దుష్టశక్తుల నివారణ, దైవిక రక్షణ, లోకక్షేమం కదుర్గ, సరస్వతి, గాయత్రి, లక్ష్మీ దేవతలకు 10,000 తామర పుష్పాలతో మహా కమలార్చన హోమం సూర్యనారాయణుని అనుగ్రహం లభించి ఆరోగ్యం, ఆయురారోగ్యం, జీవశక్తి పెరుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి.10,000 తామర పుష్పాల హోమం దుర్గ, సరస్వతి, గాయత్రి, మహాలక్ష్మి దేవతలకు సమర్పించే అత్యంత అరుదైన మహాహోమం. ఇది జ్ఞానం, ఐశ్వర్యం, రక్షణ, సర్వమంగళాలను ప్రసాదిస్తుందని విశ్వాసం.ముఖ్యంగా శత చండీ పారాయణం నిర్వహించేందుకు అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు భారతదేశం నుండి 30 మందికి పైగా ఋత్వికులు పాల్గొంటున్నారు. వేదాంతం శర్మ గారి ఆధ్వర్యంలో వేదశాస్త్ర నియమాలను అత్యంత కచ్చితత్వంతో పాటిస్తూ ప్రతి క్రతువు నిర్వహించబడుతోంది.ఈ మహత్తర కార్యానికి యాగ కమిటీ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో, వైస్ ఛైర్మన్ సాక్షి విజయ్* గారి నాయకత్వంలో, కార్యదర్శి జంగా కిషోర్ గారి సమన్వయంతో, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు అనేక మంది సేవాభావం గల భక్తుల సహకారంతో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular