కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

- Advertisement -

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఉద్యమం ఫలితం – ప్రతిపక్షాల వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూలై 25 (వాయిస్ టుడే న్యూస్):

Union Education Minister Dharmendra Pradhan resigns.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఇండియా కూటమి పార్టీలతో పాటు పలు రాజకీయ పార్టీలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి

యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా: ధర్మేంద్ర ప్రధాన్ ,10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి ,నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశా ,దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు ,యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి ,యువత చదువు కోసమే సమయం కేటాయించాలి. ధర్మేంద్ర ప్రధాన్

పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలు, పేపర్ లీక్ ఘటనలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనకారులు ఆరోపించారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి.

మంత్రి రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ, ఇది విద్యార్థుల ఉద్యమానికి, ప్రజాస్వామ్య పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నాయి.

వివిధ ప్రజా సంఘాలు కూడా స్పందిస్తూ, “ఇకపై విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా పరీక్షల నిర్వహణను పటిష్టం చేయాలి. పేపర్ లీక్‌లను పూర్తిగా అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది” అని పేర్కొన్నాయి.

నీట్ పేపర్ లీక్ ఘటనతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, విద్యా వ్యవస్థలో సంస్కరణల అవసరంపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular