తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

Telangana activist and former MLA Peddi Sudarshan Reddy passes away.

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస.. కేసీఆర్, కేటీఆర్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్, జూలై 31 (వాయిస్ టుడే): తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, పార్టీ కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నర్సంపేట నియోజకవర్గంలో శోకఛాయలు అలముకోగా, ఆయన భౌతికకాయానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు.

“తెలంగాణకు తీరని లోటు” – కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ప్రజల పక్షాన నిలబడి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.

ఆయన మరణం బీఆర్ఎస్‌కే కాకుండా తెలంగాణ సమాజానికే తీరని లోటని పేర్కొంటూ, పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి కార్యకర్తలకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. “జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా” అంటూ నివాళులర్పించారు.

“ఆప్త మిత్రుడిని కోల్పోయాను” – కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి నడిచిన ఆప్త మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకితభావంతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కొనియాడిన కేసీఆర్, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular