ఎంపీలు వద్దిరాజు,దీవకొండలు స్వర్గీయ జయశంకర్ సార్ కు ఘన నివాళులు

- Advertisement -

ఎంపీలు వద్దిరాజు,దీవకొండలు స్వర్గీయ జయశంకర్ సార్ కు ఘన నివాళులు
MPs Vaddiraju and Deevakonda pay rich tributes to the late Jayashankar Sir.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తోడుగా నిలిచి పోరాడారని వారు కొనియాడారు.పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీలు రవిచంద్ర, దామోదర్ రావులు స్వర్గీయ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
తెలంగాణ అస్థిత్వం,ప్రజల స్వాభిమానం, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం జయశంకర్ తన జీవితాంతం కృషి సల్పారని శ్లాఘించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో… 2011లో
ఆయన మహనీయుడు మనల్ని వీడివెళ్లడం బాధాకరమన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు అమూల్యం అని ఎంపీలు వద్దిరాజు,దీవకొండలు వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular