పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా కేసీఆర్

- Advertisement -

పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా కేసీఆర్

దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం

ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి.. తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలు

KCR stands as the pillar of support for the Peddi family.

హైదరాబాద్, ఆగస్టు 8:
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయం ప్రకారం దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అదే సమయంలో వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

దీంతో మొత్తం రూ.2.25 కోట్లను పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించి, కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ అధినేత నిర్ణయించారు.

కుటుంబానికి ఆర్థిక సహాయంతోనే బాధ్యత ముగియదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పిల్లల భవిష్యత్తు, వారి విద్య, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్ పేర్కొన్నారు.

దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు వారి కుటుంబాల సంక్షేమాన్ని కూడా పార్టీ బాధ్యతగా భావిస్తుందని ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular