బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి,

- Advertisement -

బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి,

District SP D. Janaki inspected the Balanagar police station,
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీడి.జానకి, మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) విధులు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి, ఫిర్యాదుల స్వీకరణ, స్టేషన్ రికార్డుల నిర్వహణ, బీట్ వ్యవస్థ, నేర నియంత్రణ చర్యలు తదితర అంశాలను ఎస్పీ గారు పరిశీలించారు.
స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, నేర నియంత్రణ, రాత్రి గస్తీ, బీట్ పోలీసింగ్, అనుమానితులపై నిఘా తదితర అంశాలపై SHOతో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం స్వీకరించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి–44 (NH-44) ఉండటంతో పాటు బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ గారు SHOను ఆదేశించారు. నిర్మాణ పనుల కారణంగా నిరంతరం ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని సూచించారు.
పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్దీని ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఫైర్ వాహనాలు తదితర అత్యవసర సేవల వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే మైనర్ల డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అధిక వేగం, తప్పుదారి ప్రయాణం తదితర వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేసుల దర్యాప్తులో నాణ్యత, వేగం పెంచి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కోర్టు కేసుల్లో సమర్థవంతమైన ఫాలోఅప్ కొనసాగించాలని ఎస్పీ గారు ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular