తెలంగాణలో నిరుద్యోగులకు భారీ ఊరట…

- Advertisement -

తెలంగాణలో నిరుద్యోగులకు భారీ ఊరట

యూనిఫామ్‌ ఉద్యోగాల వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు

Major relief for the unemployed in Telangana.

హైదరాబాద్, ఆగస్టు 19 (వాయిస్ టుడే):
యూనిఫామ్‌ సర్వీసుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ యూనిఫామ్‌ శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం జీవో నంబర్‌ 122 జారీ చేసింది.

ఇప్పటికే అమల్లో ఉన్న ఐదేళ్ల వయోసడలింపునకు అదనంగా మరో రెండేళ్లు కలపడంతో మొత్తం 7 ఏళ్ల వయోసడలింపు లభించనుంది. దీంతో వయసు మించిపోయి ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వేలాది మంది అభ్యర్థులకు మరోసారి పోటీ చేసే అవకాశం దక్కనుంది.

ఏ శాఖలకు వర్తిస్తుంది?

ఈ సడలింపు పోలీస్‌ శాఖలోని కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, ఏఆర్‌, కమ్యూనికేషన్స్‌ పోస్టులతో పాటు అగ్నిమాపక, జైళ్ల, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఎక్సైజ్‌, రవాణా, అటవీ శాఖల్లోని సంబంధిత పోస్టులకు వర్తించనుంది.

ప్రస్తుతం కొనసాగుతున్న పోలీస్‌ నియామక ప్రక్రియకు కూడా ఈ వయోసడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.

రిజర్వేషన్‌ అభ్యర్థులకు అదనపు ప్రయోజనం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 7 ఏళ్ల సడలింపుతో పాటు వారికి నిబంధనల ప్రకారం లభించే అదనపు వయోసడలింపు కూడా వర్తించనుంది. దీంతో యూనిఫామ్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులకు మరింత ప్రయోజనం కలగనుంది.

ప్రభుత్వ నిర్ణయంతో వయసు మించిపోయిన నిరుద్యోగ యువతలో మళ్లీ ఆశలు చిగురించాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular