చకోర- లూనార్ లవ్ బర్డ్” మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన పూరి జగన్నాథ్
Puri Jagannadh releases the title motion poster of the movie “Chakora – Lunar Love Bird”.
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా “చకోర- లూనార్ లవ్ బర్డ్”. ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. “చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది.
“చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమా ఆడియోను ప్రముఖ ఆడియో లేబుల్ టి సిరీస్ రిలీజ్ చేయబోతోంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై వచ్చిన ప్రేమ కథలకు భిన్నమైన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త లవ్ ఫీల్ ను పంచనుంది. త్వరలో “చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ వెల్లడించనున్నారు.
నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు




