కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్  చేసే పోరాటాన్ని ఆవిష్క‌రించే వైవిధ్య‌మైన చిత్రం ‘డాయ్‌రా’..  

- Advertisement -

*న్యాయం కోసం రెండు విభిన్న దారుల్లో కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్  చేసే పోరాటాన్ని ఆవిష్క‌రించే వైవిధ్య‌మైన చిత్రం ‘డాయ్‌రా’..  

‘Daira’ is a unique film that showcases the struggle undertaken by Kareena Kapoor Khan and Prithviraj Sukumaran.
జాతీయ అవార్డ్ గ్ర‌హీత మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌*
– జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతీలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘డాయ్‌రా’ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్
‘డాయ్‌రా’ మూవీ ట్రైలర్ విడుదలైంది. నిజం ఎప్పుడూ ఒకేలా ఉండదని, న్యాయం ఎవరి కోణంలో వారు ఎలా అర్థం చేసుకుంటారనేదానిపై ఆధారపడి ఉంటుందని, ప్రతి నిర్ణయం వెనుక ఓ ఘ‌ట‌న ఉంటుంద‌నే అంశాలను ఈమూవీ  ట్రైలర్‌లో ఆస‌క్తిక‌రంగా చూపించారు. సెప్టెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. క్రైమ్, న్యాయం, శిక్ష వంటి అంశాలను భావోద్వేగభరితంగా, ఉత్కంఠభరితంగా, విభిన్న కోణాలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను యష్ కేస్వానీ, సీమా అగర్వాల్, మేఘనా గుల్జార్ కలిసి అందించారు.
నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘డాయ్‌రా’ కథ.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం, ఆగ్రహానికి కారణమైన ఓ నేరం తర్వాత చోటుచేసుకునే పరిణామాల చుట్టూ సాగుతుంది. ఆ నేరానికి సంబంధించిన నిజాలను వెలికితీసే క్రమంలో రెండు వేర్వేరు దర్యాప్తులు ప్రారంభమవుతాయి. సమాధానాల కోసం అన్వేషణ మరింత లోతుగా సాగే కొద్దీ, కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారుల దారులు కలుస్తాయి. అయితే విధి నిర్వహణ, న్యాయం విషయంలో ఇద్దరి ఆలోచనా విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఒకే కేసులో రెండు వ్యతిరేక వైపులా నిలిచిన వీరిద్దరూ.. ఏది తప్పు, ఏది ఒప్పు అనే ఆలోచ‌న‌కే సవాల్ విసిరే పరిస్థితులను ఎదుర్కొంటారు.
ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..వాస్తవికతకు దగ్గరగా సాగుతున్న‌ట్లుపిపిస్తుంది. కథ ముందుకు సాగే కొద్దీ ఒక్కో కొత్త విషయం బయటపడుతూ కేసుపై ఉన్న ఆలోచ‌న‌నే మార్చేస్తుంది. ఉత్కంఠను క్రమంగా పెంచుతూ సాగిన ట్రైలర్‌లోని పదునైన, ఆలోచింపజేసే సంభాషణలు నిజం, న్యాయం గురించి కొన్ని కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అదే సమయంలో ‘డాయ్‌రా’ కేవలం జరిగిన నేరం గురించే కాకుండా.. ఆ ఘటనపై ప్రజల్లో ఏర్పడే అభిప్రాయాలు, దాని చుట్టూ అల్లుకుపోయే విభిన్న కథనాలను కూడా ఆసక్తికరంగా ఆవిష్కరిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
‘డాయ్‌రా’ కథలో ప్రధానంగా సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఒక కథనం ఎంత త్వరగా తీర్పుగా మారిపోతుంది? ప్రతి ఒక్కరికీ ఓ అభిప్రాయం ఉన్నప్పుడు.. అసలు న్యాయం ఎలా ఉండాలనేది నిర్ణయించేది ఎవరు? మనం కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉన్నప్పుడు.. ఏది నిజమని నమ్మాలని ఎంచుకుంటాం? అనే ఆలోచింపజేసే ప్రశ్నలను ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
ట్రైలర్‌లో కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు జితేంద్ర జోషి, క్షితీ జోగ్, కన్వల్‌జీత్ సింగ్, సందీప్ కులకర్ణి, తృప్తి ఖమ్కర్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. వీరి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లు కథకు మరింత భావోద్వేగాన్ని జోడిస్తున్నాయి. భిన్నమైన ఆలోచనా విధానాలు, కఠినమైన నిర్ణయాలు, వాటి పర్యవసానాల నేపథ్యంలో సాగే ఈ కథలో.. ప్రతి పాత్ర తనదైన కోణంలో కథకు మరింత ప‌దును తెచ్చేలా ఉంద‌ని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular