టాక్సిక్ లో అదేం సీన్లు
What kind of scenes are those in *Toxic*?
హైదరాబాద్, ఆగస్టుు 31
యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై గోషామహల్ ఎమ్మెల్యే
రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేం అశ్లీలత అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.సినీ పరిశ్రమ
సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాత్మక చిత్రాలు తీయాలని రాజాసింగ్ సూచించారు. దర్శకులు హింస, అశ్లీలతను మాత్రమే నమ్ముకోకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ధర్మం,
భక్తి పెంపొందించేలా సినిమాలు రూపొందించాలని పిలుపునిచ్చారు.టాక్సిక్ సినిమా చూడటానికి తాను థియేటర్‌కు వెళ్లానని రాజాసింగ్ తెలిపారు. అయితే సినిమాలోని అశ్లీలత, తీవ్ర హింసను భరించలేక
మధ్యలోనే బయటకు వచ్చేశానని చెప్పారు. యశ్ వంటి అగ్ర కథానాయకులు కుటుంబంతో కలిసి చూసేలా మంచి సినిమాలు చేయాలని సూచించారు.సమాజంలో ధర్మం, భక్తి, బాధ్యత పెంచే చిత్రాలు
అవసరమని రాజాసింగ్ అన్నారు. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’, ‘ఛావా’ సినిమాలను ఆయన ఉదాహరణగా చెప్పారు. ‘ఇరుముడి’లో ఆధ్యాత్మికత, సామాజిక బాధ్యత కనిపిస్తాయని
ప్రశంసించారు. ‘ఛావా’లో ధైర్యం, దేశభక్తి వంటి అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ‘టాక్సిక్’ విడుదలైన తొలిరోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సినిమా
మంచి ఫలితాలు సాధిస్తుండటం గమనార్హం
రెండో వారంలో ఇరుముడి కలెక్షన్లు
రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. రెండో వారాంతంలో సినిమా వసూళ్లు భారీగా పెరిగాయి. పదో రోజు భారత్‌లో రూ.15 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.
అంతకుముందు రోజు రూ.12.30 కోట్లతో పోలిస్తే 22 శాతం వృద్ధి నమోదు చేసింది.దీంతో భారత్‌లో సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.129.55 కోట్లకు చేరాయి. దేశీయ గ్రాస్ వసూళ్లు
రూ.150.45 కోట్లుగా ఉన్నాయి. విదేశాల్లో పదో రోజు రూ.1 కోటి గ్రాస్ వచ్చింది. దీంతో ఓవర్సీస్ కలెక్షన్లు రూ.20.50 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ.170.95 కోట్లుగా
నమోదైంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ‘ఇరుముడి’కి ప్రధాన బలంగా నిలిచాయి. పదో రోజు ఈ రెండు రాష్ట్రాల నుంచి రూ.15.50 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటక రూ.1.40 కోట్లు రాబట్టింది. తమిళనాడు
రూ.20 లక్షలు, కేరళ రూ.1 లక్ష, మిగతా ప్రాంతాలు రూ.34 లక్షలు సాధించాయి. దీంతో పదో రోజు మొత్తం గ్రాస్ రూ.17.45 కోట్లుగా ఉంది.ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా తొలి రోజే
రూ.15.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.16.20 కోట్లు, తొలి ఆదివారం రూ.19 కోట్లు రాబట్టింది. నాలుగో రోజు రూ.12.35 కోట్లు, ఐదో రోజు రూ.12.20 కోట్లు, ఆరో రోజు
రూ.10.20 కోట్లు వసూలు చేసింది. ఏడో రోజు రూ.6.90 కోట్లకు పడిపోయిన కలెక్షన్లు.. ఎనిమిదో రోజు రూ.10.10 కోట్లు, తొమ్మిదో రోజు రూ.12.30 కోట్లకు పుంజుకున్నాయి.తొలి వారం
భారత్‌లో రూ.92.15 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో వారంలో తొలి మూడు రోజుల్లోనే రూ.37.40 కోట్లు రాబట్టింది.మద్యానికి బానిసైన ఓ తండ్రి కథే ఇరుముడి. తన కుమార్తె కోరిక మేరకు
అయ్యప్ప దీక్ష తీసుకునేందుకు సిద్ధమైన అతడి జీవితంలో గతం మరోసారి ఎదురవుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక
విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 21న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలైంది.




