వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్
‘First Bench Premakatha’ title poster launched by V. Vijayendra Prasad
శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ ’ …. ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ్య సభ్యులు
వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు, ఈ చిత్రం విజయం సాధించాలని ఆయన అన్నారు.
ఫస్ట్ బెంచ్‌లో మొదలైన ప్రేమ… చివరికి వారి జీవితాలనే మార్చిన కథ…. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక విద్యా విధానంలో ర్యాంకుల కోసం పోటీ, యువతి, యువకుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆశలు ఒకవైపు… ఈ gen – z తరం క్షణిక ఆనందాలు, భావోద్వేగాలు, తొలి ప్రేమ మరోవైపు…
ఇద్దరు టాప్ ర్యాంకర్స్ మధ్య మొదలైన ఈ ప్రేమ, వారి చదువు, భవిష్యత్తు, కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపింది? ప్రేమ తర్వాత వారి జీవితాల్లో వచ్చిన అలజడి ఎక్కడికి దారితీసింది అనే ఎమోషనల్ జర్నీ.
ప్రతి ఒక్కరి కాలేజ్ రోజులను, వారి తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే… యువత ప్రేమ, చదువు, భవిష్యత్తు, కుటుంబం మధ్య జరిగే సంఘర్షణను హృదయానికి హత్తుకునేలా చూపించే చిత్రం, అదే “ఫస్ట్ బెంచ్ ప్రేమకథ”
ఈ చిత్రానికి కొల్లబత్తిన జోష్న రాణి, నక్క హరిబాబు, కె రమేష్ చంద్ర నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శివకోటి బాబి, పఠాన్ వలీఖాన్, కాకరపల్లి రాజు.
నటీనటులు – బానోతు పవన్, గౌతమ్, నర్మద, సతీష్, తదితరులు




