“డేవిడ్ రెడ్డి” సినిమా నుంచి నటి రమ్యకృష్ణ పోస్టర్

- Advertisement -

“డేవిడ్ రెడ్డి” సినిమా నుంచి నటి రమ్యకృష్ణ పోస్టర్

Poster of actress Ramya Krishna from the movie “David Reddy”
‘రా కింగ్’ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా “డేవిడ్ రెడ్డి”. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా “డేవిడ్ రెడ్డి” సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ రోజు నటి రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు  శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ “డేవిడ్ రెడ్డి” సినిమా నుంచి ఆమె బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ పోస్టర్ లో ఆమె ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి తన ఆసనంపై కూర్చుని ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో కమల రెడ్డి పాత్ర ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా గుర్తుండిపోనుంది.
నటీనటులు – ‘రా కింగ్’ మంచు మనోజ్, మరియా ర్యబోషప్క, రమ్యకృష్ణ, ఆర్. పార్తీబన్, కాంచన, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular