- Advertisement -
సిబ్బంది రాక లేటు.. కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళాలు
Staff arrive late… Collectorate’s main gate locked.
యాదాద్రి: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఉద్యోగులు విధులకు సమయానికి హాజరుకాకపోవడంతో ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్‌రావు కఠిన చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటలవుతున్నా పలువురు ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో ఆయన ఆదేశాల మేరకు ఉదయం 10.40 గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేటును మూసివేశారు.
సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
- Advertisement -




