ఓ నా సిద్ధయ్య’ పాట పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : చంద్రబోస్
I hope the song ‘O Naa Siddhayya’ becomes a big hit: Chandrabose
హైదరాబాద్: సిద్ధు రెడ్డి, కాత్యాయని జగన నటించిన ‘ఓ నా సిద్ధయ్య’ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రామ్ అద్నాన్ ఈ పాటను రాసి అందంగా తెరకెక్కించారు. కళ్యాణ్ కీస్ సంగీత సారథ్యంలో రామ్ అద్నాన్, శ్రీనిధి ఈ పాటను ఆలపించారు. అరుణ్ కొలుగూరి కెమెరా, ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించారు. కందకట్ల క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ ‘ఓ నా సిద్ధయ్య’ పాటకు సంబంధించిన టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌ని శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చంద్రబోస్, కాసర్ల శ్యాం, నల్గొండ గద్దర్ మరియు గీతా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
*ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ* .. ‘నా సోదర సమానుడైన సిద్ధు రెడ్డి ‘ఓ నా సిద్ధయ్య’ పాటను చేయడం ఆనందంగా ఉంది. సిద్ధు రెడ్డి ప్రభుత్వ పాఠశాల్ని నిర్మించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అడగక ముందే అందరికీ సాయం చేస్తుంటాడు. మూడు వందల మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించాడు. అలాంటి మంచి మనిషి చేసిన ఈ పాట పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ మాట్లాడుతూ* .. ‘సిద్ధుతో నాకు ఆరేడు నెలల పరిచయమే అయినా ఆరేడు జన్మల బంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. నా సోదర సమానుడైన సిద్ధు కోసం ఓ మంచి పాట రాశాను. అది కూడా త్వరలో రాబోతోంది. రామ్ చేసిన ‘ఓ నా సిద్ధయ్య’ పాట ముందుగా రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది. రామ్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ పాటలో సిద్ధు గొప్పగా నటించాడు. తెరపై, తెర వెనుక సిద్ధు ఒకటేలా ఉంటారు. సిద్ధు చేసే సేవా కార్యక్రమాల గురించి వింటూ ఉన్నాను. సిద్ధు ఇలానే మున్ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*కాసర్ల శ్యాం మాట్లాడుతూ* .. ‘ఒక్క పూట పరిచయంతోనే సిద్ధు సోదరుడు నాకెంతో ఆనుబంధం ఏర్పడింది. సిద్ధు భయ్యా ఈ పాటలో గొప్పగా నటించాడు. రాము ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించాడు. ‘ఓ నా సిద్ధయ్య’ పాట సిద్ధు భయ్యాని ఓ మెట్టు పైకి ఎక్కించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*సిద్ధు రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘ఓ నా సిద్ధయ్య’ ఈవెంట్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రామ్, లక్ష్మణ్ పాటలు ఖండాంతరాలు దాటాయి. వారు పాడే పాటలు, రాసే అక్షరాలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. మూడు వందల మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఇవ్వడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది. నా భర్త హాస్పిటల్లో ఉన్నాడని ఓ మహిళ ఫోన్ చేసింది. అప్పుడు నా వంతుగా ఆర్థిక సాయం చేశాను. కానీ హాస్పిటల్ బిల్ మాత్రం ఐదు లక్షల వరకు వెళ్లింది. అప్పుడు నాకు ఈ ఇన్సూరెన్స్ గురించి ఆలోచన వచ్చింది. అరుణ్, రామ్ చేసిన సపోర్ట్ వల్లే ఈ సాంగ్‌ను చేయగలిగాను. ఇది కేవలం సాంగ్లా కాకుండా సినిమాని చేసిన ఫీలింగ్ కలిగింది. కాత్యాయని అద్భుతంగా నటించింది. సిద్ధు రెడ్డి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తాం. ‘ఓ నా సిద్ధయ్య’ పాటను మంచి హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
*నటి కాత్యాయని మాట్లాడుతూ* .. ‘సిద్ధు రెడ్డి గారితో నటించడం ఆనందంగా ఉంది. ‘ఓ నా సిద్ధయ్య’ పాట అద్భుతంగా వచ్చింది. ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ పాట ఉంటుంది’ అని అన్నారు
*రామ్ అద్నాన్ మాట్లాడుతూ* .. ‘సిద్ధు రెడ్డి అన్న కథనే ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశాం. ఇది కేవలం పాటలా నాకు అనిపించలేదు. ఓ పెద్ద సినిమాని చేసిన ఫీలింగ్ కలిగింది. ఇందులో కుటుంబ భావోద్వేగాలు, భార్యాభర్తల బంధం ఇలా అన్నీ ఈ పాటలో చూపించాం. ఈ పాట అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. జీవితంలో కష్టపడిన భార్యాభర్తలందిరకీ ఈ పాట మనసుకి హత్తుకుంటుంది. ఈ పాట అందరి ఇళ్ళల్లో ఉంటుంది’ అని అన్నారు.
*నల్గొండ గద్దర్ మాట్లాడుతూ* .. ‘సిద్దు రెడ్డిలో ప్రజా నాయకుడు, హీరో కనిపిస్తారు. పేదవాళ్ల కోసం నిలబడే గొప్ప గుణం ఉంది. ‘ఓ నా సిద్ధయ్య’ పాట కోసం రాము నన్ను పిలిచాడు. చంద్రబోస్ అన్న, కాసర్ల శ్యాం అన్నను ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది. పాట కోసం పని చేసిన అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
*గీతా భాస్కర్ మాట్లాడుతూ* .. ‘సిద్ధు రెడ్డితో నేను పని చేసింది తక్కువే. ఒక్క పూటే పని చేసినా ఎంతో తెలుసుకున్నా. అతను చేసే సేవా కార్యక్రమాలు తెలిసి నాలో కొత్త ఇన్‌స్పిరేషన్‌ను వచ్చింది. నేను కూడా ఏదైనా చేయాలని అనిపించింది’ అని అన్నారు
ఓ నా సిద్ధయ్య’ పాట పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : చంద్రబోస్

- Advertisement -
- Advertisement -



