అక్టోబర్ 9th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న “చకోర” మూవీ
The movie “Chakora” is set for a worldwide release on October 9th.
High Joy Commercials బ్యానర్ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర – Lunar love Bird.
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రాన్ని చూసి మెచ్చుకున్న శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు గారు అత్యధిక మొత్తం చెల్లించి వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు.
ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ డాక్టర్. చింతాడ హేమారావు మాట్లాడుతూ మా మొదటి ప్రయత్నంలోనే చకోర మూవీ ఓన్లీ థియేట్రికల్ రైట్స్ ద్వారానే టేబుల్ ప్రాఫిట్ లభించినందుకు గర్వపడుతున్నామని ఆనందాన్ని వ్యక్తపరచారు.
శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు మాట్లాడుతూ వేరే వాళ్ళు హక్కుల కోసం పోటీ పడుతున్నా తమకు ప్రాధాన్యత ఇచ్చి థియేట్రికల్ హక్కులు ఇచ్చినందుకు గాను ప్రొడ్యూసర్ డాక్టర్ చింతాడ హేమారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.
‘చకోర – Lunar Love Bird’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. చకోర ఆడియో TSeries Music ద్వారా రిలీజ్ అయి మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతోంది.
నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు




