గణనాథుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

- Advertisement -

 పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా గణనాథుని పూజలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

Police Commissioner Gaush Alam participated in special prayers for Lord Ganesha.
కరీంనగర్
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రతిష్ఠించిన గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపిఎస్ ప్రత్యేక పూజల్లో పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో పాటు పలువురు భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని, ప్రజలందరూ ఉత్సవాలను సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular