నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

- Advertisement -

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
భద్రాద్రి కొత్తగూడెం

Suspicious death of a nursing student
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి (18) అనే యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది.  ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక మృతదేహం లభించింది. పక్కింటి వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లి ఆరోపణ. తండ్రి మరణించడంతో కూలి పనులు చేసి ఇద్దరు కూతుళ్లను  తల్లి రాజేశ్వరి చదివిస్తోంది. సెలవుల నేపథ్యంలో హరిణి ఇటీవలే ఇంటికి వచ్చింది. అదే గ్రామంలోని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి హరిణి కనిపించడంలేదని  తల్లి వెతికింది.  ఈ నేపథ్యంలో ఒంటిపై గాయాలతో, బాత్రూమ్ వెనుక హరిణి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular