పద్మశాలీలకు ప్రాధాన్యం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు

- Advertisement -

పద్మశాలీలకు ప్రాధాన్యం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు

Gratitude to CM Revanth Reddy for according importance to the Padmashali community.

హైదరాబాద్‌: పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పలువురికి వివిధ కీలక పదవులు కల్పించడంతో పాటు చేనేత కార్మికులకు సంబంధించిన పెండింగ్‌ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి అఖిలభారత, తెలంగాణ పద్మశాలి సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పద్మశాలి సంఘాల నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌గా, గూడూరు శ్రీనివాస్‌ను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్‌ చైర్మన్‌గా, వెంకటరమణను రాష్ట్ర హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, కొండ రాజును ఆర్ట్‌ డైరెక్టర్‌గా నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో ఏర్పాటు చేయనున్న స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణకు సంబంధించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పద్మశాలి సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

పద్మశాలీలు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు. పద్మశాలి సామాజిక వర్గానికి, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నట్లు వెల్లడించారు.

చేనేత కార్మికులకు సంబంధించిన రూ.290 కోట్ల త్రిఫ్ట్‌ ఫండ్‌ పాత బకాయిలను, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బతుకమ్మ చీరల బకాయిలకు సంబంధించిన రూ.380 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినందుకు కూడా పద్మశాలి సంఘాల నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఈరపత్రి అనిల్‌కుమార్‌, అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్‌, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళితో పాటు అఖిలభారత, తెలంగాణ పద్మశాలి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular