“క్రేజీ కల్యాణం” సినిమా నుంచి ‘ అల సెంద్రవంక’ లిరికల్ సాంగ్

- Advertisement -

“క్రేజీ కల్యాణం” సినిమా నుంచి ‘ అల సెంద్రవంక’ లిరికల్ సాంగ్
‘Ala Sendravanka’ lyrical song from the movie “Crazy Kalyanam”
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్
‘అల సెంద్రవంక’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ తో ఈ పాటను కంపోజ్ చేయగా జి. వెంకన్న ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి అందంగా పాడారు.
‘ అల సెంద్రవంక’ లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే – ‘అందం మురిసే, గంధం కురిసే పిల్లా నీ మేని సొగసులనే చూసి, వేకువలోనా వెన్నెల కాసి, పిల్లా నీ పెదవులపై నవ్వై పూసే, నీ అడుగులతోనే అవనే పులకించే, నీ తనువును తాక మేఘం తలవంచే, సింగిడి రంగులతో పొంగే ఆకాశం, నీ ఒంటికి చీరై నిగనిగా మెరిసిందా..’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట
నటీనటులు – నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular