- Advertisement -
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై ముంబైలో జరిగిన కాల్పుల ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం టైగర్ బయలుదేరుతుండగా ముగ్గురు వ్యక్తులు ఆయన BMW కారుపై కాల్పులు జరిపినట్లు కథనం పేర్కొంది. ఈ ఘటనలో టైగర్ డ్రైవర్, ఓ వ్లాగర్ గాయపడగా, నిందితులను కోటాలో అరెస్ట్ చేసి ముంబైకి తీసుకొచ్చినట్లు తెలిపింది. విచారణలో సల్మాన్ ఖాన్ అసలు లక్ష్యమని, టైగర్ సులభమైన లక్ష్యంగా కనిపించడంతో ఆయనపై దాడికి పాల్పడినట్లు నిందితులు చెప్పినట్టు సమాచారం. అయితే ఈ వివరాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
- Advertisement -




