అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జనసేన మద్దతు

- Advertisement -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జనసేన మద్దతు

రూ.18 వేల వేతనం చెల్లించాలి.. ప్రభుత్వానికి డాక్టర్ గడల శ్రీనివాసరావు డిమాండ్

Jana Sena’s support for Anganwadi teachers and helpers

ఖమ్మం: ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (AITUC) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు పాల్గొని అంగన్వాడీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్లకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, AITUC చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మిరియాల రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు బండారు రామకృష్ణ, యాసంనేని అజయ్ కృష్ణ, తుడుం ఉత్తం రాజ్, స్రవంతి కన్నా, రమణ కుమార్, పూరేటి నరేష్ తదితరులతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular