వెబ్‌సైట్ సభ్యత్వంతో మున్నూరు కాపుల సంఖ్యాబలం చాటాలి : కొండా దేవయ్య పటేల్

- Advertisement -
వెబ్‌సైట్ సభ్యత్వంతో మున్నూరు కాపుల సంఖ్యాబలం చాటాలి

సభ్యత్వ నమోదు ద్వారా వాస్తవ జనాభా వివరాలు సేకరించాలి

సూర్యాపేటలో వెబ్‌సైట్ పోస్టర్‌ ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్

The numerical strength of the Munnuru Kapu community should be demonstrated through website membership: Konda Devayya Patel

సూర్యాపేట: తెలంగాణలో మున్నూరు కాపుల వాస్తవ జనాభా, సంఖ్యాబలాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరూ సంఘం వెబ్‌సైట్‌ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలని రాష్ట్ర మున్నూరు కాపు (పటేల్‌) సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కొండా దేవయ్య పటేల్‌ పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మున్నూరు కాపుల జనాభాను 28 లక్షలుగా పేర్కొనగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ కులగణనలో 13 లక్షలుగా చూపించారని ఆయన అన్నారు. ఈ వ్యత్యాసంపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి సమాజమంతా ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్నూరు కాపు (పటేల్‌) సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వెబ్‌సైట్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు మున్నూరు కాపులకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేశారు. గతంలో సమాజానికి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉండేవని, క్రమంగా వాటి సంఖ్య తగ్గడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల 11న యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ మున్నూరు కాపు అన్నదాన సత్రంలో సూర్యాపేట జిల్లా ముఖ్య నాయకులతో ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి 20 మంది చొప్పున నాయకులు హాజరుకావాలని కోరారు.

ఈ సమావేశంలో కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్‌, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, యువక మండలి రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాస నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల శ్రీనివాస్‌, కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు శెట్టి విజయభాస్కర్‌, జిల్లా గౌరవ సలహాదారులు దంతాల రాంబాబు, డేగల రమేష్‌, రామసాని రమేష్‌, ఏనుగుల వీరాంజనేయులు, ఎన్‌.సత్యనారాయణ, దంతాల పద్మరేఖ, సందీప్‌, ఇంద్రశేఖర్‌, సకినాల కృష్ణ, జానకిరాములు, త్యాగరాజు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular