- Advertisement -
సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఐ హేట్ మ్యారేజ్’ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వంలో మాదం దయానంద్, కార్తీక్ వెంపటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, పెళ్లి, కెరీర్, స్వతంత్ర జీవనం వంటి అంశాలతో నేటి జెన్‌జీ యువత ఆలోచనలు, భావోద్వేగాలను సహజంగా తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపారు. హారిక రాజేందర్, సాహితి కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
- Advertisement -




