- Advertisement -
By CHIRANJI THIRUPATHI
సార్ నేను సర్పంచ్ గా ఉన్న టైంలో పోలీస్ ఇన్ ఫార్మర్గా పనిచేస్తున్నాననే నెపంతో నక్సల్స్ నన్ను పట్టుకుని చేతులు కట్టేసి చిత్రహింసలుపెట్టి కాల్పులు జరిపగా స్పర్శ కోల్పోయి నరక యాతన అనుభవిస్తున్నా.గత 33 ఏళ్లుగా చావలేక బతుకుతున్నా అంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కేంద్ర హోంశాఖసహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వద్ద గోడు వెళ్లబోసుకున్నాడు.సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పకుండాన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
- Advertisement -




