- Advertisement -
By Sagarla. Ashok
వాయిస్ టుడే, నవంబర్ 2:. ఎస్సై ప్రాథమిక రాతపరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పోలీసు నియామక మండలి అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా హాల్టికెట్లు పొందవచ్చని సూచించింది. నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాలి.
- Advertisement -




