- Advertisement -
By CHIRANJI THIRUPATHI
భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని,భారత రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ విద్యార్థులతో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ,ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
- Advertisement -




