- Advertisement -
By ఆముదాల వెంకన్న
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమకారులతోపాటు జర్నలిస్టుల కలం కూడా కీలక పాత్ర పోషించిందని TWJF ఖమ్మం జిల్లా కమిటీ పేర్కొంది. ఎన్నో ఒత్తిళ్లు, నిర్బంధాలు, బెదిరింపులను ఎదుర్కొంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి అక్షరాల ద్వారా చాటిచెప్పారని తెలిపింది. అలాంటి జర్నలిస్టుల సేవలను గుర్తించి అర్హులైన వారిని ఉద్యమకారుల గుర్తింపు జాబితాలో చేర్చాలని కోరింది. వారికి ప్రభుత్వ పెన్షన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, కార్యదర్శి అర్వపల్లి నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Advertisement -




