Wednesday, March 4, 2026

సమయం, తేదీ మీరే ఫిక్స్ చేయండి

- Advertisement -
  • ఒళ్లు, పళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి  
  • డబుల్ బెడ్ రూం ఇళ్లపై గోబెల్స్ ప్రచారం మానుకోవాలి       
  • బీజేపీపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నేతలు చింతాకుల  సునీల్, అనిల్
  • తూర్పు అభివృద్ధిపై చర్చకు సిద్ధం
  • వాడవాడలా తిరుగుతాం..
  • ప్రగతిని కళ్ల ముందు చూపెడతాం..
  • కుసుమ సతీష్ బాబు.. ఎస్ బాస్ గా దిగజారిండు..
  • ఈటల రాజేందర్ బీసీనా? రెడ్డినా?
  • ఈటల వచ్చి బీసీ నేత  బండి సంజయ్ ని  బొంద పెట్టిండు.. కిషన్ రెడ్డిని కూర్చోబెట్టిండు..
  • అవాకులు చెవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించక తప్పదు
  • రూ.4వేల కోట్లతో జరుగుతున్న ప్రగతి కనిపించడం లేదా?
  • దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 అంతస్తుల ఆస్పత్రి

వాయిస్ టుడే వరంగల్ (వరంగల్ జిల్లా బ్యూరో ), వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 2,200 ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని, త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యే నరేందర్ చిత్తశు ద్ధితో పనిచేస్తుండగా కేవలం అక్కసుతో బీజేపీ నాయకులు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని  సహించే ప్రసక్తే లేదని జెఆర్ యూసీసీ మెంబర్, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు (మాజీ బీజేపీ) చింతాకుల సునీల్, 27వ డివిజన్ కార్పొరేట్ చింతాకుల అనిల్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. చింతాకుల సునీల్, అనిల్, పాక సుధాకర్ తదితరులతో కలిసి మంగళవారం ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  ఇకముందు బీజేపీ నాయకులు ఒళ్లు, పళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సూచించారు. వాస్తవ అభివృద్ధిని గుర్తించకుండా అవాకులుచెవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విరుచుకుపడ్డారు. రూ.4వేల కోట్లతో శీఘ్రగతిన తూర్పులో జరుగుతున్న ప్రగతి బీజేపీ నాయకుల కళ్లకు కనిపించడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 36 రకాల వ్యాధులకు కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యసేవలందించేందుకు 24అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. రూ.80కోట్లతో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన మంత్రి కేటీఆర్ చేశారని, ఆ పనులు వేగంగా ముందుకు సాగే క్రమంలో తాత్కాలిక బస్టాండ్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా  సమీక్రుత కలెక్టరేట్ సముదాయం నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టుకోనున్నట్లు తెలిపారు. రంగశాయిపేట కళాశాలలో కేజీ నుంచి పీజీ విద్యకు తొలిఅడుగు పడిందన్నారు. అలాగే సీకేఎం కళాశాలకు ఆనుకొని ఉన్న నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ లో కూడా కేజీ టూ పీజీ విద్య అమలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విధంగా ఎన్నెన్నో అభివృద్ధి పనులను ముమ్మరంగా చేపడుతూ ప్రజల నుంచి విశేష ఆదరాభిమానాలను పొందుతున్న నరేందర్ పై అక్కసుతో అబద్ధ ప్రచారానికి బీజేపీ నాయకులు పూనుకున్నారని విమర్శించారు. సమావేశం లో మండల సురేష్, కూచన క్రాంతి, సంగినేని దేవేందర్, జన్ను ప్రభాకర్, రాంకీ యాదవ్, ఐలోని రాజ్ కుమార్, బోళ్ల ఈశ్వర్, నల్ల రాజు, పొలెపాక ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

వరంగల్ బీజేపీలో వలస నేతల పెత్తనం

వరంగల్ లో తొలినుంచి కూడా బీజేపీలో వలస నాయకుల పెత్తనం కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. రూరల్ నుంచి అర్బన్ కు వలస వచ్చిన నేతలకు ఇక్కడి వారికి  పదవులు దక్కకుండా హైజాక్ చేస్తున్నారన్నారు.  బీసీలను అణగదొక్కేందుకే అగ్రవర్ణాలు వ్యూహాత్మకంగా వ్యహరించడంతో బలహీన వర్గాలు బీజేపీలో ఇమడలేకపోతున్నట్లు చెప్పారు. కమలం పార్టీలో ఉన్న 12మందికి పైగా ముఖ్య నాయకులు తమతో టచ్ లో ఉన్నారని, నరేందరన్న చేస్తున్న అభివృద్ధిని చూసి వారు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు.­

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్