Monday, March 2, 2026

టీచర్లకు గట్టి షాక్.. ప్రమోషన్లు కట్.. పనిచేస్తేనే ముందుకు..

- Advertisement -

టీచర్లకు గట్టి షాక్.. ప్రమోషన్లు కట్.. పనిచేస్తేనే ముందుకు..
హైదరాబాద్, ఫిబ్రవరి 28, (వాయిస్ టుడే )

A big shock for teachers.. Promotions cut.. Only work will get you ahead..
ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందంటే లైఫ్‌సెట్‌ రా.. అంటారు. ఎందుకంటే రాజ్యాంగం వారికి అలాంటి భద్రత కల్పించింది. కానీ ప్రైవేటులు ఎలాంటి రక్షణ ఉండదు. పనిచేస్తే చేయించుకుంటారు. లేదంటే తీసిపడేసి మరొకరిని పెట్టుకుంటారు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు పని చేసినా.. చేయకపోయినా.. తొలగించడం ఉండదు. మహా అయితే సస్పెండ్‌ చేస్తారు. తర్వాత తిరిగి తీసుకుంటారు. ఇక పదోన్నతులు అయితే.. సీనియారిటీ పెరిగే కొద్ది వస్తుంది. ఇందులోనూ రిజర్వేషన్లు ఉంటే ఇంకా తొందరగా వస్తుంది. ఇక ప్రభుత్వ విద్య గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 99 శాతం మంది టీచర్లకే తాము చెప్పే చదువుపై నమ్మకం లేదు. అందుకే తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు పంపుతారు. ఇక సర్కార్‌ బడికి వచ్చే పిల్లలకు మాత్రం ఏదో చెప్పాలి కాబట్టి అన్నట్లుగా పాఠాలు చెబుతుంటారు.తెలంగాణలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేలా చర్యలు చేపడుతోంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే విద్యావిధానంలో మార్పులు చేసింది. అడ్మిషన్లు పెంచే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించింది. ఇక ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయులకు ఇచ్చే పదోన్నతులు రద్దు చేసింది. ఇకపై పనితీరు ఆధారంగానే ప్రోత్సాహకాలు, పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఐదేళ్లకు ఒకసారి ఉపాధ్యాయుల పనితీరును మూల్యాంకనం చేస్తారు.పనితీరు మెరుగుపడకపోతే, రెండేళ్ల సమయం ఇచ్చి సర్వీస్‌ నుంచి తొలగించే నియమాలు రూపొందించాలని కమిషన్‌ సూచించింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టేబుల్‌ మీద ఉంచింది. విద్యా రంగంలో నెలకొన్న నిర్లక్ష్యం, ప్రభుత్వ పాఠశాలలపై సడలిన విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ఈ కొత్త నిబంధనల లక్ష్యంఈ సూచనలు తెలంగాణ విద్యా వ్యవస్థకు విప్లవాత్మక మలుపు తిప్పుతాయి. ప్రస్తుతం సేవా కాలం ఆధారంగా పదోన్నతులు వచ్చే వ్యవస్థ ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని తగ్గిస్తోంది. పనితీరు మూల్యాంకనం ద్వారా బాధ్యతను పెంచడం విద్యార్థుల ప్రయోజనానికి దారితీస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్