Tuesday, April 29, 2025

ఇంజన్ విఫలమై తొమ్మిది మందితో సముద్రంలో నిలిచిపోయిన బోటు

- Advertisement -

ఇంజన్ విఫలమై తొమ్మిది మందితో సముద్రంలో నిలిచిపోయిన బోటు

A boat stranded at sea with nine people on board after engine failure

యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించిన విపత్తుల నిర్వహణ శాఖ
సంయుక్త కృషితో 9 మంది ప్రాణాలు కాపాడిన ఆపద సహాయక బృందాలు
రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా
ఇంజన్ విఫలమై తిరుపతికి 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణ పట్నం పోర్టుకు సమీఫంలో నిలిచిపోయిన బోటును సురక్షితంగా వెనక్కు తీసుకురాగలిగామని రెవిన్యూ ( భూ పరిపాలన, విపత్తుల నిర్వహణ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, సర్వే సెటిల్ మెంట్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.  ఈ ఉదయం నుండి యుద్ద ప్రాతిపదికన చేపట్టిన చర్యలు సత్ ఫలితాలను ఇచ్చాయన్నారు. బోటులో చిక్కుకు పోయిన 9 మంది మత్స్య కారులను కాపాడి బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారని సిసోడియా వివరించారు. బుధవారం ఉదయం బోటు సముద్రంలో నిలిచిపోయిన విషయం కోస్ట్ గార్డ్,  కృష్ణపట్నం ఓడరేవు అధికారులకు చేరగా వెంటనే అప్రమత్తమైన విపత్తుల నిర్వహణ శాఖ తదనుగుణ చర్యలకు ఉపక్రమించింది.  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా వెంటనే రంగంలోకి దిగి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, కృష్ణపట్నం మెరైన్ హెడ్ కెప్టెన్ రజత్ తో మట్లాడారు. చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించేందుకు,  ఓడరేవు ప్రాంతం నుండి లోపలకు వెళ్లేందుకు డీజీ షిప్పింగ్ అనుమతి ఆవశ్యకతను జిల్లా కలెక్టర్, సిసోడియాకు వివరించారు. డిజి షిప్పింగ్ తో మాట్లాడిన సిసోడియా అవసరమైన అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారు. తుఫాను కారణంగా వాతావరణం ఇబ్బంది కరంగా ఉన్నప్పటికీ ఎంతో శ్రమ కోర్చిన అధికారులు, సిబ్బంది ఎట్టకేలకు విజయవంతంగా తాడును పడవతో అనుసంధానించి ఒడ్డుకు చేర్చగలిగారు.  సచివాలయం నుండి విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అటు జిల్లా కలెక్టర్ సంయిక్త కృషి ఫలితంగా 9 మంది ప్రాణాలను కాపాడగలిగారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్