విశాఖపట్నం: అర్ధరాత్రి వేళ సాగరతీరంలో కలకలం.విశాఖ తీరానికి రాత్రి సమయంలో ఓ భారీ పెట్టెకొట్టుకు వచ్చింది. దీని బరువు సుమారు వందటన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పురాతనమైన చెక్కపెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. బీచ్ లో వున్న సందర్శకులు పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎంసీఏ బీచ్కు కొట్టుకువచ్చిన చెక్కపెట్టె బ్రిటీష్ కాలం నాటిదిగా భావిస్తున్నారు.అర్ధరాత్రి సమయంలో తీరానికి పురాతన పెట్టే రావడంతో అలెర్ట్ అయిన పోలీసులు రాత్రంతా కాపలగా ఉండి మరీ పెట్టేకు భద్రత కలిపించారు.అయితే రెండు జేసీబీలతో దాన్ని తెరిచేందుకు ప్రయత్నించగా అది చెక్కపెట్టే అని తేలింది.ఇది బ్రటీష్ కాలం నాటి బాక్సుగా అదికారులు గుర్తించారు.ముఖ్యంగా దాంట్లో ఎలాంటి వస్తువులు బయట పడలేదు.అర్ధరాత్రి సమయంలో పెట్టే తీరానికి కొట్టుకొని రావడంతో కొద్ది గంటల పాటు సాగరతీరంలో హడావుడి నెలకొంది.చివరికి అదికారులు ఆ పెట్టే కేవలం చెక్కబాక్కుగా నిర్ధారించడంతో ఉఠ్కంటకు తెరపడింది.