- Advertisement -
కూరగాయల వ్యాపారి దారుణ హత్య
A brutal murder of a vegetable trader
తిరుపతి
తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఒక కూరగాయల వ్యాపారి ని హత్య చేసారు. కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.
మృతుడు కలికిరి కి చెందిన కూరగాయల వ్యాపారి అజమతుల్లా (38)గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి నిమ్మకాయల వీధికి చెందిన రుద్ర, అతని కుమారులు యశ్వంత్ కళ్యాణ్ లు. మృతుడికి ఇవ్వవలసిన చిన్నపాటి అప్పు కోసం గొడవపడి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హంతకుడు తో పాటు ఇరువురు కుమారులను, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -