- Advertisement -
యువకుడి దారుణ హత్య
A brutal murder of a young man
అక్రమ సంబంధమే కారణమని అనుమానం
వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలో యువకుడు రషీద్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి నరికి చంపారు. అక్రమ సంబంధమే హత్య కు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేములవాడ మండలం కోనాయిపల్లి కి చెందిన రషీద్ గత కొంత కాలంగా వేములవాడ లో ఉంటూ గంగాధరలో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు. నివాసం ఉంటున్న కాలనీ చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మహిళ భర్త దుబాయిలో ఉంటుండగా, వారం రోజుల క్రితమే వేములవాడకు వచ్చాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో వేములవాడ శివార్ లోని నిర్మానుష ప్రాంతంలో రషీద్ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తు ఎవరు చంపారో తెలియదు అంటున్నారు. హత్య సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
- Advertisement -