- Advertisement -
ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ కేసు నమోదు
A case of fight between two youths has been registered
సత్ప్రవర్తన నిమిత్తం ఎమ్మార్వో వద్ద 5 లక్షల రూపాయల బైండోవర్
గొడవలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరిక
మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్
ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కేసు నమోదు చేసి మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వారిని హెచ్చరించారు.మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో వివాహిత పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఆమె భర్త యువకుడి మధ్య గొడవ జరిగి దాడి చేసి కొనగా ఇద్దరికీ గాయాలైనందువలన కేసు నమోదు చేసి మండల ఎమ్మార్వో వద్ద వారి సత్ప్రవర్తన నిమిత్తం 5 లక్ష రూపాయల బైండోవర్ చేయడం జరిగిందని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ తెలిపారు. మండల పరిధిలోని గ్రామ ప్రజలు గొడవలకు దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలని ముఖ్యంగా యువకులు ఘర్షణలకు గొడవలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి తమ విలువైన భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ తనదైన శైలిలో హెచ్చరించారు.
- Advertisement -



