వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్
వరంగల్ క్రైం బ్యూరో, ఆగస్టు 29 (వాయిస్ టుడే ప్రతినిధి): బహిరంగంగా తల్వార్(కత్తి)ను ప్రదర్శించడంతో పాటు ఎలాంటి ప్రదర్శనలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోవడంతో పాటు, కొంత మంది వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యదేచ్ఛగా తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండంపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై ఎవరైన వ్యక్తులు పుట్టిన రోజుల వేడుకల సందర్భంగా కాని లేదా ఇతర కార్యక్రమాల సమయాల్లో తల్వార్లను బహిరంగంగా ఎత్తిచూపడం, వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా పోస్టులు చేయడంతో పాటు తల్వార్లు పట్టుకొని వున్న ఫోజులతో దిగిన ఫోటోలతో కూడిన ప్లెక్సీలను కూడళ్ళల్లో ఏర్పాటు చేయడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై భారతీయ శిక్షాస్మృతి ఆయుధాల చట్టం క్రింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని, ముఖ్యంగా యువకులు ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రధాన రోడ్డు మార్గాల్లో ద్విచక్ర వాహనాలను నిలిపివేసి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకున్న చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని, ఏవరైన వ్యక్తులు బహిరంగంగా తల్వార్లను ఎత్తిచూపిస్తున్న వాటిని తిప్పుతున్న పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.