- Advertisement -
ఇంటి పై కప్పు కూలి చిన్నారి మృతి
మెదక్
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం జాజి తండాలో ఇంటిపై కప్పు కూలి 3 సంవత్సరాల చిన్నారి సంగీత మృతిచెందింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి ఇంటి పైనున్న రేకులు ఎగిరిపోవడంతో సంగీత మృతి చెందింది. ఇంటి పైన ఏర్పాటుచేసిన రేకులు పైపులు తో సహా ఈదురు గాలులకు పైకి లేవడంతో పైపులకు కట్టిన ఊయలలో ఉన్న సంగీత గాయాల పాలు కావడంతో కుటుంబీకులు హుటాహుటిన హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు..
===============
- Advertisement -