తీన్మార్ మల్లన్న కారు ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి: సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్

- Advertisement -

తీన్మార్ మల్లన్న కారు ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి

కుట్ర కోణం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి

తీన్మార్ మల్లన్నకు పోలీసు భద్రత కల్పించాలి: మున్నూరు కాపు సంఘం తెలంగాణ

A comprehensive investigation must be conducted into Teenmar Mallanna’s car accident: Munnuru Kapu Sangham Telangana

హైదరాబాద్, నవంబర్ 13: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న కారుకు తిరుమలగిరి–మోత్కూరు మధ్య జరిగిన ప్రమాదంపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్ డిమాండ్ చేశారు.

ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. బహుజన వర్గాల రాజ్యాధికార సాధన లక్ష్యంగా బీసీలను చైతన్యపరుస్తూ తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రజా సమస్యలపై గొంతెత్తే నాయకులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులు ఎవరైనా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే తీన్మార్ మల్లన్నకు తగిన పోలీసు భద్రత కల్పించాలని కోరారు. ఇలాంటి ఘటనలు బీసీ వర్గాల ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదని పుట్టం పురుషోత్తమ రావు పటేల్ పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular