- Advertisement -
ఆలయం లోకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ
A container lorry rammed into the temple
మహిళకు తీవ్ర గాయాలు
తిరుపతి
వరదయ్యపాళ్యంమండల కేంద్రం లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం లోకి కంటైనర్ లారీ దూసుకువెళ్లింది. స్థానిక పోలీస్ స్టేషన్ మలుపు వద్ద ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పెను ప్రమాదం తృటిలో
తప్పింది. ఒక మహళ రక్త గాయాలతో బయట పడింది. అప్పుడే ఆలయం వెలుపల ముగ్గులు వేసి సామగ్రిని ఆలయం లోపల భధ్రపరిచేందుకు వెళ్ళగా ఇంతలో కంటైనర్ లారీ ఒక్కసారిగా ఆలయం లోనికి దూసుకు
రావడంతో మహిళ గీత తీవ్ర గాయాలతో బయటపడింది. కంటైనర్ లారీ నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాధం జరిగినట్టు స్థానికులు అంటున్నారు. పక్కనే వున్న పోలీసులు సంఘటనా
స్థలానికి చేరుకునే లోపు వాహన డ్రైవర్ పరారయ్యాడు. గాయాలపాలైన మహిళను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -