- Advertisement -
హైదరాబాద్ సీపీ
హైదరాబాద్: హైదరాబాద్ పోలీసింగ్ లో అనేక సవాళ్లు వున్నాయి. డ్రగ్స్ లాంటి సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు వెళ్తానని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బుధవారం అయన బాధ్యతలు స్వీకరించారు. సీపీ మాట్లాడుతూ క్విక్ రెస్పాన్స్ అనేది చాలా కీలకం.. ప్రజలకు త్వరగా సాయం చేయాలన్నది మా పోలీసు కర్తవ్యం. ర్యాగింగ్ ను సహించేది లేదు. షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేస్తాం. హైదరాబాద్ని డ్రగ్స్ రహిత సిటీగా మారుస్తాం. . సైబరాబాద్ , రాచకొండ కమిషనర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ డ్రగ్స్ ను నిర్మూలిస్తామని అన్నారు.
- Advertisement -