కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో డబ్బులు దోచుకున్న.. సైబర్ నేరస్తుడిని అదుపులోకి తీసుకున్న
A cyber criminal who stole money in the name of customs department was arrested
కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ పోలీస్ స్టేషన్ సిబ్బంది
కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో నివసిస్తున్నటువంటి బాధితురాలికి కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరుతో ఫోన్ రావడం జరిగింది. మీ యొక్క పేరుపైన ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో పార్సల్, రావడం జరిగింది. అందులో చాలా రకాల బ్యాంక్ ఎటిఎం కార్డ్స్ , డ్రగ్స్ మరియు పాస్పోర్ట్స్ దొరికాయి. మీరు వెంటనే ఢిల్లీ పోలీసులతో మాట్లాడాల్సిందిగా వారు కాన్ఫరెన్స్ కాల్ లో ఢిల్లీ పోలీస్ వారిని తీసుకొని రావడం జరిగింది.
బాధితురాలు వారి యొక్క మాటలను నమ్మి వారికి,వారు చెప్పినటువంటి బ్యాంక్ అకౌంట్లో రెండు దఫాలుగా దాదాపు ఇరవై ఒక్కటి లక్షల ఎనబై వేల రూపాయలను* పంపించడం జరిగింది. నేరస్తులకు డబ్బులు పంపించే సమయంలో మోసం చేస్తున్నారని గుర్తించలేకపోయానని, ఆ తర్వాత తాను మోసపోయానని గుర్తించి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ సెంటర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది.
సైబర్ క్రైమ్ కు పిటిషన్ రాగానే కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డిఎస్పి నర్సింహారెడ్డి గారు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది.
ఈ యొక్క కేసు విచారించే సమయంలో నేరస్తుడు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారని గుర్తించడం జరిగింది. డీఎస్పీ నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ సిబ్బందితో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ జిల్లాలో తలదాచుకున్న సదాన్షు శేఖర్ మహంతి ని పట్టుకోనీ కరీంనగర్ కు తీసుకొని వచ్చి రిమాండ్ కు తరలించడం జరిగింది.
నేరస్తుడిని పట్టుకొని విచారించగా వారు భువనేశ్వర్ లో వ్యాపారం చేస్తునట్లు నటించి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి పేరు పైన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగిందని , ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తన అన్న అయినటువంటి సర్వేశ్వర్ మహంతి తో కలిసి బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయడం జరిగిందని తెలిపాడు. బాధితులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పడం ద్వారా వారు డబ్బులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ కు పంపించేవారని విచారణలో తెలిపారు.
ప్రస్తుతం ఇతని అన్న అయినటువంటి సర్వేశ్వర మహంతి ఢిల్లీ పోలీసు లో ఆధీనంలో ఉన్నాడని, ఢిల్లీ రాష్ట్రంలో కూడా కేసులు ఉండటం వల్ల వారు రిమాండ్ నిమిత్తం తీసుకుని పోయారని పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సుదాన్సు శేఖర్ తన యొక్క స్వస్థలంలో ఉండకుండా రకరకాల ప్రాంతాలకు వెళ్తున్నాడని విచారణలో వెల్లడించాడు.
వీరు నేరం చేయడానికి ఉపయోగించినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ పైన దాదాపు 24 కేసులు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాలలో అదేవిధంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్, హర్యానా, కర్ణాటక మరియు మహారాష్ట్రలో కూడా వీరి పైన కేసులు ఉన్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.
నేరస్థుడిని చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ మేడం మరియు కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏస్హెచ్ఓ డిఎస్పి నర్సింహారెడ్డి అభినందించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కస్టమ్స్ పేరుతో, ట్రై పేరుతో వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉంటూ వారికి ఎలాంటి సమాచారాన్ని పంపివ్వకూడదని గుర్తు తెలియనటువంటి అప్లికేషన్ ఫైల్స్ ను డౌన్లోడ్ చేయొద్దని వాటిపైన క్లిక్ చేయవద్దని పోలీసు అధికారులు సూచనలు జారీ చేసారు.