పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావ దీక్ష చేపట్టిన అమ్మవారి భక్తుడు ముని రామ్ రెడ్డి
– మద్దతు తెలిపిన హిందూ సంఘాలు,పలు పార్టీల నాయకులు
A devotee of Ammavari who undertook Sanghibhava Diksha
తిరుపతి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యితో జరిగినఅపచారానికి, హిందూ మనోభావాలు కాపాడుకోవడానికి, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతీ ఒక్కరూ ప్రాయశ్చిత్త చేసుకోవాలని పిలుపునిస్తూ… జనసేన అధినేత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ..11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష కు సంఘీ భావం తెలుపుతూ..శుక్రవారం తిరుచానూరు చెందిన శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుడు , పత్రిక ప్రతినిధి ముని రామ్ రెడ్డి 11 రోజుల దీక్ష చేపట్టారు.ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద తిరు క్షేత్రాల సమితి తుమ్మా ఓంకార్,మహిళా జ్యోతి సమాఖ్య డి.వి రమణ,శ్రీ చాదాత్త వై ష్ణవి సేవా సంఘం బాల కృష్ణ,బిజెపి నాయకులు విజయ్ కుమార్, మణి జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు వెంకట్ రాయల్,ప్రతాప్,టిడిపి చంద్రగిరి నియోజక వర్గ బి సి సెల్ అధ్యక్షులు ముని రత్నం రెడ్డి, శ్రీను తదితరులతో కలిసి పూజలు నిర్వహించి,కొబ్బరి కాయలు కొట్టి, ఏడు కొండల వాడా… వెంకట రమణా గోవిందా గోవింద..అంటూ గోవింద నామ స్మరణ చేసి వేడుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని హిందువులందరూ.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యావత్ హిందూ సమాజం కోసం నడుం బిగించి,ముందుకు రావడం శుభ పరిణామం.ఆయన వెంట మనమంతా మద్దతు తెలుపవసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.అదే విధంగా తిరుచానూరు విలేకరి ,అమ్మవారి భక్తుడు ముని రామ్ రెడ్డి సంఘీభావం తెలుపుతూ..దీక్ష చెప్పట్టడం అభినందనీయమని, ఆయనకు ఆ పద్మావతి సమెత శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఉండాలని కోరారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా మన సనాతన ధర్మం కోసం ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.



