సంక్షోభంలో రైతాంగం.
A farmer in crisis.
హైదరాబాద్ ,సెప్టెంబర్1
(వాయిస్ టుడే స్టేట్ ప్రతినిధి.)
కేంద్రo లో అధికారంలో ఉన్న బిజెపి మోడీ,ప్రభుత్వం, అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం ,పూర్తిగా దివాలాదీసి ,రైతులు అప్పల ఊబిలో కురుకొని పోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని , ఇదేనా రైతు ప్రభుత్వం అని,అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ,ఇబ్రహీంపట్నం శుభం గార్డెన్ లో జరుగుతున్న ,తెలంగాణ రైతు సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం లో రాష్ట్రవ్యాప్తంగా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ , సీనియర్ రైతు సంఘం నాయకులు బొంతల చంద్రారెడ్డి , మాజీ ఎమ్మెల్యే రైతు సంఘం సీనియర్ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి , వివిధ జిల్లాల ,అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. విజ్జూ కృష్ణన్ ఇంగ్లీషులో మాట్లాడగా , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ,తెలుగులోకి అనువాదించారు.